Blue Whale: బాబోయ్! ఎంతపెద్ద తిమింగలమో.. కేరళ తీరానికి కొట్టుకొచ్చిన కళేబరం.. పేలిపోయే ప్రమాదం!

50 foot long whale carcass washes up on Kerala shore

  • కోజికోడ్ తీరానికి కొట్టుకొచ్చిన కళేబరం
  • దాని పొడవు 50 అడుగుల పైనే
  • చూసేందుకు ఎగబడుతున్న జనం
  • దగ్గరికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు

కేరళలోని కోజికోడ్ బీచ్‌కు కొట్టుకొచ్చిన ఓ బ్లూ వేల్ (నీలి తిమింగలం) కళేబరాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. దాని పొడవు 15 మీటర్లు (దాదాపు 50 అడుగులు) ఉంది. స్థానిక జాలర్ల ద్వారా సమాచారం అందుకున్న ఆరోగ్యాధికారి ప్రమోద్ వెంటనే బీచ్‌కు చేరుకుని తిమింగలం కళేబరాన్ని పరిశీలించారు. దాని మరణానికి కారణం తెలుసుకునేందుకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం దానిని అక్కడే పెద్దగొయ్యి తీసి పాతిపెడతామని చెప్పారు.

తీరానికి కొట్టుకొచ్చిన బ్లూ వేల్ కళేబరానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దానిని చూసేందుకు జనం పోటెత్తారు. నిజాముద్దీన్ అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. దయచేసి ఎవరూ ఆ కళేబరం వద్దకు వెళ్లొద్దని, అది పేలిపోయి గాయాలపాలయ్యే అవకాశం ఉందని హెచ్చరించాడు.

సాధారణంగా పెద్ద తిమింగలాల కళేబరాల్లో వాయువులు ఏర్పడి ఒక్కోసారి పేలిపోతుంటాయి. అవి కొన్నిసార్లు నెమ్మదిగా విడుదలవుతాయి. మరికొన్ని సందర్భాల్లో మాత్రం భారీ పేలుడుతో బయటకు వచ్చేస్తాయి. గతంలో ఇలాంటి ఘటలు చాలానే జరిగాయి. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా యూజర్ ఈ హెచ్చరిక చేశాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Blue Whale
Kerala
Kozhikode
South Beach
  • Loading...

More Telugu News