Singer Damini: ముందు సహజీవనం చేసి.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా: సింగర్ దామిని

I will marry after live in relationship says singer Damini
  • తనకు ప్రేమ వివాహం అంటేనే ఇష్టమన్న దామిని
  • ఈ రోజుల్లో సహజీవనం చేయడంలో తప్పేం లేదన్న టాలీవుడ్ సింగర్
  • తనకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తానని వ్యాఖ్య
తన పెళ్లి గురించి టాలీవుడ్ సింగర్ దామిని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... తనకు ప్రేమ వివాహం అంటేనే ఇష్టమని ఆమె చెప్పింది. కొన్నళ్ల పాటు సహజీవనం చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని  తెలిపింది. ఇప్పటి రోజుల్లో సహజీవనం చేయడంలో తప్పేం లేదని వ్యాఖ్యానించింది. అమ్మ, నాన్న కూడా తనను ఎంతో అర్థం చేసుకుంటారని తెలిపింది. వాళ్ల అనుమతి తీసుకున్న తర్వాతే తనకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తానని చెప్పింది. అయితే, తనకు నచ్చిన వ్యక్తి ఇంకా తారసపడలేదని, అందుకే తాను ఇంకా పెళ్లి చేసుకోలేదని తెలిపింది. 

ప్రస్తుతం కొనసాగుతున్న బిగ్ బాస్-7లో దామిని పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షో గురించి ఆమె మాట్లాడుతూ... తమ ఇంట్లోకి చికెన్ కూడా తీసుకురారని, అలాంటిది బిగ్ బాస్ హౌస్ లో తాను చికెన్ కర్రీ వండానని చెప్పింది. తాను పూర్తి వెజిటేరియన్ అని, అయితే గుడ్డు మాత్రం తింటానని తెలిపింది. ఇప్పటి వరకు తన ఒంటిపై ఒక్క టాటూ కూడా లేదని... తనకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి టాటూ వేయించుకుంటానని చెప్పింది.
Singer Damini
Love
Live IN

More Telugu News