Martin Luther King: సంపూర్ణేశ్ బాబు 'మార్టిన్ లూథర్ కింగ్' టీజర్ విడుదల

Sampoornesh Babu Martin Luther King teaser out now

  • 'సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో 'మార్టిన్ లూథర్ కింగ్
  • పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం
  • అక్టోబరు 27న రిలీజ్ 

విలక్షణమైన చిత్రాలతో ఆడియన్స్ కు దగ్గరైన సంపూర్ణేశ్ బాబు తాజాగా 'మార్టిన్ లూథర్ కింగ్' చిత్రంలో నటించారు. ఓ గ్రామంలో జరిగే పొలిటికల్ కామెడీ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. 'మార్టిన్ లూథర్ కింగ్' చిత్రం నుంచి ఆకట్టుకునే టీజర్ నేడు విడుదలైంది. ఈ సినిమా తమిళంలో హిట్టయిన 'మండేలా' చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. తమిళ వెర్షన్ లో కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్ర పోషించారు. 

'మార్టిన్ లూథర్ కింగ్' చిత్రానికి పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించారు. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టయిన్ మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. 'మార్టిన్ లూథర్ కింగ్' చిత్రం అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో సీనియర్ నటుడు నరేశ్, శరణ్య ప్రదీప్, వెంకటేశ్ మహా తదితరులు నటించారు.

More Telugu News