Uttar Pradesh: యూపీలో మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుళ్లు
- ఉత్తరప్రదేశ్ హర్దోయి జిల్లాలో శనివారం ఘటన
- ఎస్పీ కార్యాలయం నుంచి సమీప పోలీస్ స్టేషన్‌కు మహిళను ఈడ్చుకెళ్లిన వైనం
- ఘటనకు బాధ్యులైన కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- ఫిర్యాదు చేసేందుకు వస్తే ఇలా చేశారని బాధితురాలి ఆవేదన
- ఎస్పీ కార్యాలయం గోడ ఎక్కేందుకు మహిళ ప్రయత్నించిందని పోలీసుల వాదన
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు రోడ్డుపై ఈడ్చుకుంటూ సమీప పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఉత్తరప్రదేశ్ హర్దోయి జిల్లాలో శనివారం ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో ఎస్పీ కేశవ్‌చంద్ గోస్వామి మహిళా కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
బాధితురాలిది పిహానీ ప్రాంతం. ఆ మహిళ ఎస్పీ కార్యాలయం గోడ ఎక్కేందుకు ప్రయత్నించిందని పోలీసులు చెబుతున్నారు. కానీ, తాను ఓ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు మాత్రమే వచ్చానని బాధితురాలు పేర్కొంది. తనను లోపలికి అనుమతించకుండా ఇలా దారుణంగా ఈడ్చుకెళ్లారని వాపోయింది. ఘటనపై విచారణకు ఆదేశించామని ఎస్పీ మీడియాకు తెలిపారు.