Pawan Kalyan: నేను వెళ్లి ఆ మాట అడిగితే జగన్ కు ఆనందంగా ఉంటుంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan slams CM Jagan in Avanigadda

  • అవనిగడ్డలో పవన్ వారాహి యాత్ర
  • జగన్ తనను కాపులతో తిట్టిస్తున్నాడన్న పవన్
  • పిల్లవేషాలు వేయొద్దంటూ జగన్ కు వార్నింగ్
  • నన్నేం చేయగలవ్ జగన్? అంటూ సవాల్

అవనిగడ్డ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 10 ఏళ్ల నుంచి ముద్దులు పెడుతున్నాడు, తిరుగుతున్నాడు అని జగన్ ను గెలిపిస్తే దెయ్యమై రాష్ట్రాన్ని పీడిస్తున్నాడని మండిపడ్డారు. 

తనను కాపులతో తిట్టిస్తూ జగన్ పిల్లవేషాలు వేస్తున్నాడని వ్యాఖ్యానించారు. "నన్ను ఎవరితోనైనా తిట్టించుకో... నాకేమీ కాదు. కానీ జగన్ ఇలాంటి పిల్లవేషాలు వేయడం, చచ్చు సలహాలు ఇవ్వడం ఆపి పరిణతితో ఆలోచించు" అని హితవు పలికారు. 

"నేను భగత్ సింగ్ వారసుడ్ని... జగన్ లాంటి వాళ్లకు భయపడేవాడ్ని కాదు. నేను వెళ్లి నా సినిమా రిలీజ్ అవుతోంది... కాస్త టికెట్ రేట్లు పెంచండి అంటే జగన్ కు ఆనందంగా ఉంటుంది. పవన్ కల్యాణ్ అంతటివాడే నా వద్దకు వచ్చాడని జగన్ సంబరపడతాడు. కానీ నాకు ఒక పొగరు ఉంది జగన్... నా సినిమాలు ఆపుకుంటావా ఆపుకో... భయపడతానని మాత్రం అనుకోవద్దు. నన్నేం చేయగలవ్ జగన్?" అంటూ సవాల్  విసిరారు. 

"నేను కులాల మధ్య వైషమ్యాలు దూరం చేయడం గురించి, కులాల గురించి, వారికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడతాను. జగన్ లాగా ముఖ్యమైన పదవులన్నీ ఒకే కులానికి కట్టబెట్టే మనస్తత్వం నాది కాదు. నా ఫ్యాన్స్ లో అన్ని కులాల వారు ఉన్నారు... అన్ని కులాల వారికి న్యాయం జరగాలని ఆలోచిస్తాను" అని పవన్ స్పష్టం చేశారు.

More Telugu News