Nara Bhuvaneswari: హైదరాబాదులో డ్రమ్స్ మోగించిన నారా భువనేశ్వరి

- చంద్రబాబు అరెస్ట్ పై భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు
- మోత మోగిద్దాం కార్యాచరణ విజయవంతం చేసిన నేతలు, కార్యకర్తలు
- హైదరాబాదులో తన నివాసంలో మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి
- సత్యమేవ జయతే అంటూ నినదించిన చంద్రబాబు అర్ధాంగి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో మోత మోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిర్వహించిన మోత మోగిద్దాం కార్యక్రమంలో నారా భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. హైదరాబాదులోని తమ నివాసంలో ఆమె తీన్ మార్ డ్రమ్స్ మోగించారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, రోజు తాము చేస్తున్న ఈ శబ్దం ప్రజలందరికీ చేరుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు నీతి నిజాయతీ కలిగిన నేత అని స్పష్టం చేశారు.. ఈ పోరాటంతో చెడు నుంచి రాష్ట్రం బయట పడుతుంది అని ధీమా వ్యక్తం చేశారు. సత్యమేవ జయతే అంటూ నినదించారు. బాబుతో నేను ప్లకార్డును ప్రదర్శించారు.



