Virat Kohli: మరోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ

Second baby for Anushka and Virat Kohli

  • రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్క
  • ఇటీవల గైనకాలజీ క్లినిక్ లో కనిపించిన కోహ్లీ, అనుష్క
  • 2021లో వామికకు జన్మనిచ్చిన అనుష్క

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్కశర్మ రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముంబైలో ఓ గైనకాలజీ క్లినిక్ లో ఇటీవల కోహ్లీ, అనుష్కలు కెమెరా కంటికి చిక్కారు. అయితే ఆ ఫొటోలను పబ్లిష్ చేయవద్దని పాప్పరాజీలను వారు కోరారు. ఈ విషయాన్ని తామే అధికారికంగా ప్రకటిస్తామని వారు కోరినట్టు సమాచారం. 2021లో కోహ్లీ దంపతులకు వామిక అనే బిడ్డ జన్మించింది. వారి కూతురు వామిక ఫొటోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేయడంలేదు.

More Telugu News