Balakrishna: పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం: బాలకృష్ణ

TDP full support for Pawan Kalyan Varahi Yatra
  • తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదన్న బాలకృష్ణ
  • తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
  • రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని ఆరోపణ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. తప్పుడు కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని అన్నారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్లో ఈరోజు టీడీపీ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాలకృష్ణతో పాటు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.
Balakrishna
Telugudesam
Pawan Kalyan
Janasena
Varahi Yatra

More Telugu News