Mla Bajireddy: ఎమ్మెల్యే బాజిరెడ్డికి షాక్ ఇచ్చిన గ్రామస్థులు

MLA Bajireddy boycotted by Manchippa villagers
  • ఎన్నికల ప్రచారానికి మా ఊరికి రావొద్దంటూ పోస్టర్లు
  • మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైన్ ను రద్దు చేయాలని డిమాండ్
  • రాబోయే ఎన్నికల్లో బాజిరెడ్డిని ఓడిస్తామని వార్నింగ్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారానికి రావద్దంటూ నిజామాబాద్ జిల్లా మంచిప్ప గ్రామస్థులు ఆయనకు షాక్ ఇచ్చారు. గ్రామంలో పోస్టర్లు అతికించి మరీ నిరసన తెలిపారు. ప్లకార్డులు చేతిలో పట్టుకుని ప్రదర్శిస్తూ ఎమ్మెల్యేపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంచిప్ప రిజర్వాయర్ విషయంలో గ్రామంలో చాలా ఏళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ రిజర్వాయర్ కు సంబంధించి తయారుచేసిన రీ డిజైన్ ను రద్దు చేయాలని మంచిప్ప గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆ పని చేసే వరకూ తమ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేయొద్దని ఎమ్మెల్యేను హెచ్చరించారు.

ఆందోళనలో భాగంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటామని, తమ డిమాండ్ ను నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడిస్తామని గ్రామస్థులు హెచ్చరించారు. మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైన్ రద్దు చేయకుంటే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామంటూ గ్రామంలో తీర్మానం చేశారు. అనంతరం బాజిరెడ్డికి వ్యతిరేకంగా ఇంటింటికీ తిరుగుతూ గుమ్మాలపై పోస్టర్లు అంటించారు.

Mla Bajireddy
Manchippa
Posters
villagers
BRS

More Telugu News