Vizag Beach Mystery: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పురాతన పెట్టె.. చూసేందుకు ఎగబడిన జనం!

Huge box came to Vizag YMCA sea shore

  • వైఎంసీఏ తీరానికి కొట్టుకొచ్చిన పెట్టె
  • అందులో విలువైన సంపద ఉండే అవకాశం ఉందని చర్చ
  • రాత్రంతా కాపలాగా ఉన్న పోలీసులు
  • పురావస్తుశాఖకు సమాచారం

విశాఖపట్టణం తీరానికి కొట్టుకొచ్చిన ఓ పెద్ద పెట్టె మిస్టరీగా మారింది. తీరానికి నిన్న ఓ పెద్ద పురాతన పెట్టె కొట్టుకు వచ్చిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో దానిని చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. ఆ పెట్టెలో విలువైన సంపద ఏదో ఉండే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.

వైఎంసీఏ బీచ్‌లోకి పెట్టె కొట్టుకు వచ్చిందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని దానికి కాపలాగా ఉన్నారు. పెట్టెను ఎవరూ ముట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పురావస్తుశాఖ అధికారులు వచ్చి పెట్టెను తెరిచే అవకాశం ఉందని, వారికి ఇప్పటికే సమాచారం అందించినట్టు చెబుతున్నారు. ఇంత భారీ పెట్టె సముద్ర తీరానికి కొట్టుకురావడం ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందన్నది మాత్రం మిస్టరీగా మారింది.

Vizag Beach Mystery
YMCA Beach
Box

More Telugu News