Sai Rajesh: 'బేబీ' దర్శకుడికి బెంజ్ కారు గిఫ్టుగా ఇచ్చిన నిర్మాత ఎస్కేఎన్

Producer SKN gifts Mercedes Benz car to Baby movie director Sai Rajesh

  • ఇటీవల విడుదలైన బేబీ చిత్రం
  • సరికొత్త కథతో విజయాన్నందుకున్న దర్శకుడు సాయిరాజేశ్
  • ఇవాళ బెంజ్ కారును బహూకరించిన నిర్మాత 

ఇటీవల విడుదలైన బేబీ చిత్రం ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధానపాత్రల్లో సాయిరాజేశ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. వైవిధ్యభరితమైన కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాయిరాజేశ్ పై ప్రశంసల జల్లు కురిసింది. కాగా, బేబీ చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో, నిర్మాత ఎస్కేఎన్ దర్శకుడు సాయిరాజేశ్ కు ఖరీదైన కానుక ఇచ్చారు. ఓ విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ కారును ఇవాళ గిఫ్టుగా అందించారు. తనకు లగ్జరీ కారును బహూకరించడం పట్ల సాయిరాజేశ్... నిర్మాత ఎస్కేఎన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News