Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా

Chandrababu bail petition hearings postoponed to october 3

  • సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్
  • చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూథ్రా
  • ఇరువైపుల వాదనల అనంతరం వచ్చే నెలకు వాయిదా వేసిన న్యాయస్థానం

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తొలుత సీఐడీ తరఫు న్యాయవాది ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించగా, ఆ తర్వాత చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

రెండు రోజుల క్రితం సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా ఢిల్లీ నుంచి వాదనలు వినిపించారు. అనంతరం సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. చంద్రబాబు అక్రమాలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారన్నారు. ఆ తర్వాత తదుపరి వాదనలు కొనసాగించే క్రమంలో భాగంగా విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News