Janhvi Kapoor: మార్ఫింగ్ చేసిన నా ఫొటోలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను: జాన్వీ కపూర్

Janhvi Kapoor talks about photo morphing

  • పదేళ్ల వయసులోనే తన ఫొటోలు మార్ఫింగ్ చేశారన్న జాన్వీ
  • స్కూల్లో కంప్యూటర్ స్క్రీన్ పై ఆ ఫొటోలు చూశానని వెల్లడి
  • ఆ ఫొటోలు చాలా అసౌకర్యంగా అనిపించాయన్న నటి

అతిలోక సుందరి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ ల కుమార్తెగా సినీ రంగప్రవేశం చేసిన జాన్వీకపూర్ కెరీర్ లో క్రమంగా ఎదుగుతోంది. సినీ తార కాబట్టి సహజంగానే జాన్వీపై కూడా పుకార్లు వస్తుంటాయి. మరింత అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటోందంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఫొటో మార్ఫింగ్  సమస్యను కూడా ఈ బ్యూటీ ఎదుర్కొందట. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ వీటన్నింటి గురించి స్పందించింది. ముఖ్యంగా, ఫొటో మార్ఫింగ్ అంశాన్ని ప్రస్తావించింది.

"అప్పుడు నాకు పదేళ్లుంటాయి. స్కూల్లోని కంప్యూటర్ ల్యాబ్ లో నా క్లాస్ మేట్ కంప్యూటర్ స్క్రీన్ పై నా ఫొటోలు చూసి నిర్ఘాంతపోయాను. ఆ ఫొటోలు చాలా అసౌకర్యంగా అనిపించాయి. దాదాపు పోర్నోగ్రఫీ సైట్లలో ఉండే ఫొటోల్లా అనిపించాయి. దాంతో నా ఫ్రెండ్స్ నావైపు అదోలా చూడడం మొదలుపెట్టారు. అంతేకాదు, వ్యాక్సింగ్ చేయించుకోలేదా అంటూ ఆటపట్టించారు" అని జాన్వీ గుర్తుచేసుకుంది.

Janhvi Kapoor
Phot Morphing
Actress
Bollywood
  • Loading...

More Telugu News