Harish Rao: మేం వదిలేసిన నాయకులను కాంగ్రెస్ తీసుకుంటోంది: మంత్రి హరీశ్ రావు

Harish Rao targtes Congress party

  • కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన హరీశ్
  • 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థులు లేరని ఎద్దేవా
  • కరెంటు లేదంటున్న కోమటిరెడ్డి ప్లగ్ లో వేలు పెట్టాలని సూచన
  • ఎవరెన్ని ట్రిక్కులు చేసినా తాము హ్యాట్రిక్ కొట్టి తీరుతామని ధీమా

తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకడంలేదని, బీఆర్ఎస్ పార్టీ వదిలేసిన నాయకులను కాంగ్రెస్ తీసుకుంటోందని ఎద్దేవా చేశారు. 

కరెంటు అంశాల గురించి, ముఖ్యంగా ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ కు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరెంటు రావడంలేదని అంటున్నారని, ఓసారి ఆయన ప్లగ్ లో వేలు పెట్టి చూస్తే కరెంటు వస్తుందో లేదో అర్థమవుతుందని హరీశ్ రావు వ్యంగ్యం ప్రదర్శించారు. 

అసలు, మీ పార్టీకే గ్యారెంటీ లేనప్పుడు ప్రజలకేం గ్యారెంటీలు ఇస్తారని కాంగ్రెస్ ఎన్నికల హామీలపై సెటైర్ విసిరారు. "పక్కనే ఉన్న కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇటువైపు ఛత్తీస్ గఢ్ లో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే... అక్కడేమో రూ.600 ఇస్తారట... తెలంగాణకు వచ్చి రూ.4000 ఇస్తామనడం చెవిలో పువ్వు పెట్టడం కాదా!... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరుగురు ముఖ్యమంత్రులు మారతారు. కాంగ్రెస్ పార్టీ అధికార పీఠం ఎక్కితే మతకల్లోలాలు వస్తాయి" అని అన్నారు.   

తెలంగాణలో మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

Harish Rao
BRS
Congress
Telangana
  • Loading...

More Telugu News