Ganpath: నా గురువు అమితాబ్ నటించిన 'గణపథ్' టీజర్ షేర్ చేయడం సంతోషంగా ఉంది: చిరంజీవి

Chiranjeevi shares Ganpath teaser

  • టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అమితాబ్ బచ్చన్ ప్రధానపాత్రల్లో గణపథ్
  • వికాస్ బెహల్ దర్శకత్వంలో హైఓల్టేజ్ చిత్రం
  • అక్టోబరు 20న విడుదల
  • చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

టైగర్ ష్రాఫ్, అమితాబ్ బచ్చన్, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గణపథ్. పూజా ఎంటర్టయిన్ మెంట్, గుడ్ కో ప్రొడక్షన్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రానికి వికాస్ బెహెల్ దర్శకుడు. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

కాగా, గణపథ్ తెలుగు వెర్షన్ టీజర్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ప్రియాతి ప్రియమైన టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అన్నింటికి మించి నా గురువు అమితాబ్ బచ్చన్ నటించిన గణపథ్ చిత్రం టీజర్ పంచుకోవడం సంతోషం కలిగిస్తోంది. ఈ చిత్రం విజయం సాధించాలంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు  తెలుపుకుంటున్నాను" అంటూ చిరంజీవి ఎక్స్ లో స్పందించారు.

More Telugu News