CPI Narayana: విశాఖ రాజధాని అనే మాట అభాసుపాలయింది: సీపీఐ నారాయణ

CPI Narayana comments on Vizag

  • మద్యం మాఫియా, భూదందాలకు విశాఖ కేరాఫ్ అడ్రస్ గా మారిందన్న నారాయణ
  • రూ. 350 కోట్ల బెట్టింగులు జరిగాయని విమర్శ
  • చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని వ్యాఖ్య

ముఖ్యమంత్రి జగన్ చెపుతున్న విశాఖ రాజధాని అనే మాట అభాసుపాలయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మద్యం మాఫియా, భూదందాలకు విశాఖ కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పారు. విశాఖలో అధికార పార్టీ నేతలు చేస్తున్న దందాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని చెప్పారు. విశాఖలో రూ. 350 కోట్ల బెట్టింగులు జరగడం వైసీపీ మాఫియా పాలనకు నిదర్శనమని అన్నారు. విశాఖ కేంద్రంగా గంజాయి, బెట్టింగ్ దందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాఫియాను వైసీపీ నేతలు సపోర్ట్ చేస్తున్నారని, విజయవాడ కేంద్రంగా వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెపుతారని అన్నారు.

CPI Narayana
Chandrababu
Telugudesam
Vizag
YSRCP
  • Loading...

More Telugu News