KCR: అనారోగ్యం నుంచి కోలుకోని కేసీఆర్.. నేటి కేబినెట్ సమావేశం వాయిదా

Telangana cabinet meeting postponed due to KCR health

  • వైరల్ ఫీవర్, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న కేసీఆర్
  • అక్టోబర్ మొదటి వారంలో కేబినెట్ భేటీ జరగొచ్చని సమాచారం
  • వచ్చే నెల రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. మంత్రివర్గ సమావేశం తిరిగి ఎప్పుడు జరగనుందనే విషయంలో క్లారిటీ రాలేదు. అక్టోబర్ మొదటి వారంలో కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలతో పాటు ఎన్నికల గురించి కూడా చర్చించాలని కేసీఆర్ భావించినట్టు సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థుల అభ్యర్థిత్వాలను రాష్ట్ర గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై కూడా కేబినెట్ లో చర్చ జరిగేది. 

అక్టోబర్ రెండో వారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉండటంతో... కేసీఆర్ దీనిపై పూర్తిగా దృష్టి సారించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఇదే చివరి కేబినెట్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. దసరా తర్వాత ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించే అవకాశం ఉంది.

KCR
BRS
Fever
Telangana Cabinet
  • Loading...

More Telugu News