employees: జీపీఎస్ విధానం రద్దు చేయకుంటే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఏపీసీపీఎస్ఈఏ ఉద్యోగులు

Employees protest against GPS

  • జగన్‌కు ఓటువేసి తాము తప్పు చేశామని మోకాళ్లపై ఉద్యోగుల నిరసన
  • ఎన్నికలకు ముందు ఓపీఎస్ విధానాన్ని తీసుకువస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం
  • ప్రభుత్వం జీపీఎస్ విధానాన్ని రద్దు చేయాల్సిందేనని డిమాండ్

జీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద జీపీఎస్ ప్రతులను దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు ఓటువేసి తాము తప్పు చేశామంటూ ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. చెప్పులతో తమ చెంపలను తామే వాయించుకున్నారు. ఎన్నికలకు ముందు ఓపీఎస్ విధానాన్ని తీసుకు వస్తామని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు తమను మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం జీపీఎస్ విధానాన్ని రద్దు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

employees
Andhra Pradesh
  • Loading...

More Telugu News