New Delhi: కుక్క వాకింగ్‌తో ఊడిన కొలువు.. ఐఏఎస్ అధికారిణితో బలవంతపు రాజీనామా

ias rinku compulsorily resigned after dog walking controversy

  • ఢిల్లీలోని త్యాగరాజ్ మైదానంలో కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లిన ఐఏఎస్ రింకూ దుగ్గా, ఆమె భర్త
  • వారి కోసం క్రీడాకారులను నిర్వాహకులు ముందస్తుగానే మైదానంలోంచి పంపించేసిన వైనం
  • ఘటన వివాదాస్పదం కావడంతో కేంద్రం సీరియస్ 
  • ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐఏఎస్ రింకూ దుగ్గా

పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు మైదానంలోని క్రీడాకారులను పంపించేసిన ఘటనలో ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గా తాజాగా తన కొలువు పోగొట్టుకున్నారు. ప్రభుత్వం ఆమెతో బలవంతంగా రాజీనామా చేయించేసింది. ప్రభుత్వ అధికారుల ప్రాథమిక నిబంధనలు, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ గవర్నమెంట్ ఉద్యోగినైనా ముందస్తుగా పదవీ విరమణ చేయమని కోరే హక్కు ప్రభుత్వానికి ఉంది.  

ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు రింకూ దుగ్గా క్రీడాకారులను ముందుగానే పంపించివేయడం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా ఈ స్టేడియం సాయంత్రం ఏడు గంటల వరకూ క్రీడాకారులకు అందుబాటులో ఉండాలి. ఈ క్రమంలో, పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు రింకూ, ఆమె భర్త ఈ మైదానాన్ని వాడుకోవడం ప్రారంభించారు.  ఈ జంట ఆదేశాల మేరకు నిర్వాహకులు నిర్ణీత సమయానికంటే ముందే క్రీడాకారులను బయటకు పంపించేసేవారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో రింకూ తన ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆమె భర్త సంజీవ్ ఖిర్వార్ లడఖ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News