Khairatabad: కదిలిన ఖైరతాబాద్ గణనాథుడు... మొదలైన శోభాయాత్ర

Khairatabad Ganesh procession starts

  • ఉదయం 6 గంటలకే ప్రారంభం
  • మధ్యాహ్నం గం.1.30లోగా నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు
  • కొనసాగుతున్న బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర

హైదరాబాద్ లో గణేశ్ శోభాయాత్ర మొదలైంది. బాలాపూర్ తో పాటు ఖైరతాబాద్ మహా గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్‌ శ్రీ దశ మహా విద్యా గణపతి నిమజ్జన శోభాయాత్ర ఉద‌యం 6 గంటలకు ప్రారంభమైంది. అర్థరాత్రి చివరి కలశ పూజ జరిపి, తెల్లవారుజామునే గణనాథుడిని ట్రాలీపైకి ఎక్కించారు. ఈ శోభాయాత్ర మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. శోభాయాత్రకు తెలంగాణ‌ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 

ఎన్‌టీఆర్‌ మార్గ్‌లో ఖైరతాబాద్‌ గణపతిని క్రేన్‌ నెంబర్‌-4 వద్దకు మధ్యాహ్నం 12.30కు చేర్చాలని షెడ్యూల్ చేశారు. నిమజ్జనం మధ్యాహ్నం 1.30 లోపు జరిగేలా ఏర్పాట్లు చేశామని పోలీసులు చెప్పారు. మరోవైపు బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర 19 కిలోమీటర్లు సాగనుంది. చాంద్రాయణగుట్ట, హుస్సేన్‌సాగర్‌, మోజంజాహీ మార్కెట్‌ మీదుగా హుస్సేన్‌సాగర్‌ వరకు శోభాయాత్ర జరగనుంది.

Khairatabad
Ganesh
shobhayatra
balapur
Hyderabad
  • Loading...

More Telugu News