Kamineni Srinivas: కైకలూరులో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో కామినేని శ్రీనివాస్ భేటీ

Kamineni Srinivas held meeting in Kaikaluru

  • అక్టోబరు 6న కైకలూరులో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర 
  • నేడు సన్నాహక భేటీ నిర్వహించిన కామినేని
  • వారాహి యాత్రను విజయవంతం చేయాలని పిలుపు

మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ ఇవాళ ఏలూరు జిల్లా కైకలూరులో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. అక్టోబరు 6న పవన్ కల్యాణ్ కైకలూరులో వారాహి విజయయాత్రకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు పార్టీల నేతలతో కామినేని శ్రీనివాస్ సన్నాహక భేటీ నిర్వహించారు. టీడీపీ-జనసేన సమన్వయంతో వారాహి యాత్రను విజయవంతం చేయాలని అన్నారు. 

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ ఐక్యపోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కైకలూరు పర్యటనలో పవన్ కల్యాణ్ కొల్లేరు, ఆక్వా సమస్యలపై ప్రస్తావిస్తారని వెల్లడించారు. వైసీపీ పాలనలో ఆక్వా రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని కామినేని పేర్కొన్నారు.

More Telugu News