Raviteja: సంక్రాంతి బరిలోకి దిగుతున్న 'ఈగల్' .. రిలీజ్ డేట్ ఖరారు!

Eagle movie release date confirmed

  • 'టైగర్ నాగేశ్వరరావు'గా రవితేజ
  • అక్టోబర్ 20వ తేదీన సినిమా విడుదల
  • కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన 'ఈగల్'
  • జనవరి 13వ తేదీన సినిమా రిలీజ్

రవితేజ సినిమాలు రెండు విడుదల దిశగా కదులుతున్నాయి. ఒకటి 'టైగర్ నాగేశ్వరరావు' అయితే, మరొకటి 'ఈగల్'. వంశీ దర్శకత్వంలో రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాతో, నుపుర్ సనన్ కథానాయికగా పరిచయమవుతోంది. 

ఇక ఆ తరువాత చాలా తక్కువ గ్యాపులోనే రవితేజ నుంచి మరో సినిమా థియేటర్లకు రానుంది. ఆ సినిమా పేరే 'ఈగల్'. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా, సంక్రాంతికి రానుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. తాజాగా రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు.

 జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, కావ్య థాపర్ - అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. 'ఏక్ మినీ కథ' .. 'బిచ్చగాడు 2' సినిమాల ద్వారా కావ్యథాపర్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.

Raviteja
Kavya Thoper
Anupama
Eagle Movie
  • Loading...

More Telugu News