Chandrababu: రోబోటిక్స్ గ్యాలరీలో ప్రధాని మోదీకి చాయ్ సర్వ్ చేసిన రోబో

PM Modi enjoyed a cup of tea served by Robots
  • వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్‌కు హాజరైన ప్రధాని మోదీ
  • సైన్స్ సిటీలోని రోబోటిక్స్ గ్యాలరీని సందర్శించిన ప్రధాని
  • రోబో తమకు చాయ్ ఇచ్చిన ఫొటోను మిస్ కావొద్దని వ్యాఖ్య
ప్రధాని నరేంద్రమోదీకి ఓ రోబో చాయ్ అందించింది. ఈ ఆసక్తికర సంఘటన అహ్మదాబాద్‌లోని వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా చోటు చేసుకుంది. ప్రధాని మోదీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్ గ్యాలరీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్యాలరీలో ప్రదర్శించిన ఓ రోబో మోదీకి చాయ్ అందించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

గుజరాత్ సైన్స్ సిటీలో రోబోటిక్స్ గ్యాలరీ తనను ఎంతగానో ఆకట్టుకుందని, రోబో తమకు చాయ్ ఇచ్చిన ఫొటోను అస్సలు మిస్ కావొద్దని క్యాప్షన్ పెట్టి ఫొటోలను, వీడియోను షేర్ చేశారు. రోబోటిక్స్ గ్యాలరీలో తనకు ఓ రోబో టీ సర్వ్ చేసిందని పేర్కొన్నారు.
Chandrababu
Gujarat

More Telugu News