Chandrababu: చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టులో ప్రారంభమైన విచారణ.. తీవ్ర ఉత్కంఠ

Supreme Court hearing started in Chandrababu case
  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్
  • విచారణకు లంచ్ బ్రేక్ ఇచ్చిన సుప్రీం ధర్మాసనం
  • మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న విచారణ
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమయింది. జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టిలు పిటిషన్ పై విచారణ చేపట్టారు. అయితే భోజన సమయం కావడంతో విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత విచారణ తిరిగి ప్రారంభం కానుంది. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వేలు వాదనలు వినిపిస్తున్నారు. రేపటి నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు చంద్రబాబు పిటిషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.
Chandrababu
Telugudesam
Supreme Court

More Telugu News