Jagapathi Babu: అవంటే నాకు చాలా భయం: జగపతిబాబు

Jagapathibabu Interview

  • ఆరోగ్యంపై దృష్టిపెట్టానన్న జగపతిబాబు
  • జీవితంలో తృప్తి ముఖ్యమైందని వ్యాఖ్య 
  • దెయ్యాలంటే భయమని వెల్లడి
  • చివరి పదేళ్ల జీవితమే ముఖ్యమైనదని వివరణ  

జగపతిబాబు ఇప్పుడు స్టార్ విలన్ గా ఫుల్ బిజీ. ఇతర భాషా చిత్రాలతోను ఆయన తీరికలేకుండా ఉన్నారు. జర్నలిస్టు ప్రేమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 'ఒకప్పటి నా లైఫ్ స్టైల్ వేరు .. ఇప్పటి నా లైఫ్ స్టైల్ వేరు. ఇప్పుడు నేను నా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను" అన్నారు. 

"జీవితంలో చివరి పదేళ్ల కాలమే చాలా విలువైనదని నేను భావిస్తాను. తృప్తి వలన సంతోషం .. సంతోషం వలన ఆరోగ్యం లభిస్తాయని నేను నమ్ముతాను. మనసుకు .. శరీరానికి శిక్షణ చాలా అవసరం. సరైన శిక్షణ ముందు నుంచి ఇస్తూ వెళ్లినప్పుడే, ఆ రెండూ నీ మాట వింటాయి .. ఒంటరి తనాన్ని తట్టుకుని నిలబడే శక్తిని ఇస్తాయి" అని చెప్పారు. 

"మొదటి నుంచి కూడా నాకు దెయ్యాలు అంటే భయం. అవి ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు. అలాగే ఇరుకైన ప్రదేశాలు అంటే కూడా భయమే. అలాంటి చోట్లకి నేను వెళ్లను. ఇక చనిపోయిన తరువాత ఏం జరుగుతుందనే ఆలోచన కూడా నాకు భయాన్నే కలిగిస్తాయి. చనిపోయాక లైఫ్ ఇంతకంటే బెటర్ గా ఉంటుందా? బాధగా ఉంటుందా? అసలు అప్పుడు ఆనందాలు .. బాధలు తెలుస్తాయా? అనేది ఇప్పటికీ నాకు అంతుబట్టని విషయాలు" అంటూ నవ్వేశారు. 

Jagapathi Babu
Actor
Tollywood
  • Loading...

More Telugu News