Pawan Kalyan: టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత తొలిసారి జనంలోకి జనసేనాని పవన్ కల్యాణ్​

Fourth leg Janasena Varahi Vijaya yatra from October 1

  • అక్టోబర్1 నుంచి  నాలుగో విడత జనసేన వారాహి విజయ యాత్ర 
  •  అవనిగడ్డ నుంచి యాత్ర ప్రారంభం కానున్న యాత్ర
  • చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పవన్ యాత్రపై  సర్వత్రా ఆసక్తి

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ నాలుగో విడత ‘జనసేన వారాహి విజయ యాత్ర’ను  అక్టోబర్ 1న ప్రారంభించనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి యాత్ర ప్రారంభం అవనుంది. మచిలీపట్నం, పెడన, కైకలూరు మీదుగా జనసేనాని వారాహి విజయ యాత్రను కొనసాగించనున్నారు.

ఇప్పటికే మూడు విడతల్లో ఈ యాత్ర చేసిన పవన్‌.. ప్రజా సమస్యలపై గళమెత్తడంతో పాటు పాటు వైసీపీ పాలనపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన పవన్.. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఆయనకు సంఘీభావం తెలిపారు. జైలు ముంగిటే టీడీపీ, జనసేన పొత్తు గురించి ప్రకటన చేశారు. ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉన్న నేపథ్యంలో పవన్‌ యాత్రపై ఏపీలో సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నాయి.

More Telugu News