Manpreet Badal: ప్లాట్ కొనుగోలు కేసులో బీజేపీ నేత, పంజాబ్ మాజీ మంత్రిపై లుక్ అవుట్ నోటీసులు

Lookout notice issued against Manpreet Badal

  • బటిండాలో ఆస్తుల కొనుగోలులో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణ
  • ప్రస్తుతం బీజేపీలో ఉన్న మన్‌ప్రీత్‌సింగ్ బాదల్
  • మరో ఐదుగురిపైనా కేసులు

ప్లాట్ కొనుగోలు కేసులో పంజాబ్ మాజీ ఆర్థికమంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌పై అన్ని విమానాశ్రయాల్లోనూ లుక్ అవుట్ నోటీసు జారీ అయింది.  బటిండాలో ఆస్తుల కొనుగోలుల అక్రమాలకు సంబంధించి పంజాబ్ విజిలెన్స్ బ్యూరో బాదల్‌తోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. 

ప్రస్తుతం బీజేపీ నేతగా ఉన్న బాదల్, గతంలో బటిండా డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ) చీఫ్ అడ్మినిస్ట్రేటర్ బిక్రంజీత్ షేర్‌గిల్, మరో నలుగురిపై కేసులు నమోదయ్యాయి. ఆ నలుగురిని రాజీవ్ కుమార్, అమన్‌దీప్ సింగ్, వికాశ్ అరోరా, పంకజ్‌గా గుర్తించినట్టు అధికారులు తెలిపారు.

Manpreet Badal
Punjab
BJP
Look Out Notice
  • Loading...

More Telugu News