atlee: అట్లీతో అల్లు అర్జున్ సినిమా.. ఏడాదిలోనే పూర్తయ్యేలా ప్లాన్​!

Atlee to direct allu arjun

  • ప్రస్తుతం పుష్ప2లో నటిస్తున్న బన్నీ
  • రేపటి నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్
  • ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో నటించే అవకాశం

‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఆ సినిమాలో నటనకు గాను  జాతీయ అవార్డు కూడా దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప ద రూల్’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.  సుకుమార్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. రేపటి నుంచి రామోజీ ఫిల్మ్‌ సిటీలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. ఈ ఏడాదే షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో బన్నీ తన తదుపరి ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. అయితే, ఇప్పుడు తన ప్లాన్‌ మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యేందుకు ఐదారు నెలలు పట్టే అవకాశం ఉంది. 

ఈ గ్యాప్‌లో జవాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాలనుకుంటున్నట్టు టాక్. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయని, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం అందుతోంది.  బన్నీ కోసం అట్లీ పవర్‌‌ ఫుల్ యాక్షన్ తో కూడిన కథను సిద్ధం చేశాడట. జవాన్‌కు మ్యూజిక్‌ అందించిన అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా చిత్రీకరణను ఏడాదిలోనే పూర్తి చేసే ఆలోచనతో బన్నీ, అట్లీ ఉన్నారని కూడా తెలుస్తోంది.

atlee
Allu Arjun
Pushpa
Trivikram Srinivas
  • Loading...

More Telugu News