Ravali: రవళి అందుకే సినిమాలు మానేసింది: ఆమె సోదరుడు విజయ్

Vijay Interview

  • హరిత - రవళి గురించి ప్రస్తావించిన విజయ్ 
  • తన చెల్లెళ్లిద్దరూ మంచి ఆర్టిస్టులని కితాబు 
  • హరిత నటించకుండా ఉండలేదని వెల్లడి 
  • రవళి నిర్ణయం వెనుక కారణం అదేనని వ్యాఖ్య

90వ దశకాలంలోని స్టార్ హీరోయిన్స్ జాబితాలో 'రవళి' పేరు కూడా కనిపిస్తుంది. హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న రవళి, 2011 నుంచి తెరపై కనిపించలేదు. సీనియర్ హీరోయిన్స్ చాలామంది కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ అవుతున్నారు. మరికొందరు టీవీ షోస్ లో హోస్టుగా .. జడ్జిగా కనిపిస్తున్నారు. 

రవళి మాత్రం ఇంతవరకూ కెమెరా ముందుకు రాలేదు. ఈ విషయాన్ని గురించి ఆమె అన్నయ్య విజయ్ స్పందించారు. "హరిత .. రవళి .. నేను .. ముగ్గురం కూడా యాక్టింగ్ వైపే వచ్చాము. నాకు .. హరితకి టీవీ సీరియల్స్ మంచి పేరును తెచ్చిపెట్టాయి. రవళి మాత్రం సినిమాల్లో దూసుకుపోయింది. 'పెళ్లిసందడి' .. 'శుభాకాంక్షలు' .. ' వినోదం' సినిమాలతో స్టార్ డమ్ చూసింది" అన్నారు.

"హరిత వరుసగా సీరియల్స్ చేస్తూ వెళుతూ ఉంటుంది. ఒక్కరోజు షూటింగు లేకపోయినా ఏడ్చేస్తుంది. కానీ రవళి అలా కాదు .. తనకి పాప పుట్టిన తరువాత కాస్త లావు అయింది. అందువలన ఇక నటించకూడదని నిర్ణయించుకుని నటనను పక్కన పెట్టేసింది. టీవీ షోస్ చేయమని చెప్పినా ఆమె వినిపించుకోలేదు" అని చెప్పారు.

Ravali
Haritha
Vijay
  • Loading...

More Telugu News