Nara Lokesh: లోకేశ్ ఏర్పాటు చేసిన బెంచీని కాలువలో పడేసిన దుండగులు

Bench Throne Into canal In mangalagiri

  • మంగళగిరి నియోజకవర్గంలోని చింతలపూడి వంతెన వద్ద ఘటన
  • నీళ్లలో నుంచి బెంచీని వెలికి తీసిన స్థానికులు
  • జనం కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బెంచీని పడేయడంపై స్థానికుల ఆగ్రహం

బాటసారులు, ప్రయాణికులు కూర్చుని సేద తీరేందుకు ఏర్పాటు చేసిన బెంచీని దుండగులు కాలువలో పడేసిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలోని చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పలు బెంచీలను ఏర్పాటు చేశారు. ఈ బెంచీలకు పసుపు రంగు వేసి ‘మన మంగళగిరి.. మన లోకేశ్’ అనే నినాదం రాశారు.

శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో దీనిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చింతలపూడి వంతెన వద్ద ఏర్పాటు చేసిన బెంచీని కొంతమంది దుండగులు శనివారం రాత్రి కాలువలో పడేశారు. ఈ విషయం తెలిసి గ్రామ సర్పంచ్ తాడిబోయిన రామకృష్ణ బెంచీని కాలువలో నుంచి బయటకు తీయించారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన వసతులను ధ్వంసం చేయడం మంచిది కాదని హితవు పలుకుతూ కవ్వింపు చర్యలు వద్దని హెచ్చరించారు. బెంచీని తిరిగి అదే ప్రదేశంలో ఏర్పాటు చేయించారు.

Nara Lokesh
bench
Mangalagiri
chintalapudi
TDP
  • Loading...

More Telugu News