Shane Nigam: నెట్ ఫ్లిక్స్ సెంటర్ కి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్!

RDX movie update

  • ఆగస్టు 25న విడుదలైన 'RDX'
  • మలయాళంలో హిట్ కొట్టిన సినిమా
  • హైలైట్ గా నిలిచిన సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  
  • నిన్నటి నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్

మొదటి నుంచి కూడా మలయాళ సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ లోనే రూపొందుతూ వచ్చాయి. ఈ మధ్య కాలంలో కొన్ని భారీ సినిమాలు వస్తున్నప్పటికీ, అక్కడ చిన్న సినిమాల సక్సెస్ జోరు ఎంతమాత్రం తగ్గలేదు. అలా ఇటీవల కాలంలో అక్కడ పెద్ద హిట్ కొట్టిన చిన్న సినిమాగా 'RDX' కనిపిస్తుంది. 

షేన్ నిగమ్ .. ఆంటోని వర్గీస్ .. నీరజ్ మాధవ్ .. మహిమ నంబియార్ .. ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, నహస్ హిదాయత్ దర్శకత్వం వహించాడు. లవ్ ... ఫ్రెండ్షిప్ .. యాక్షన్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. ఇలా అన్ని అంశాలను జోడిస్తూ అల్లుకున్న ఈ కథకి అక్కడి ప్రేక్షకులు భారీ విజయాన్ని అప్పగించారు. 

ఆగస్టు 25వ తేదీన విడుదలై, మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, నిన్నటి నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. సామ్ సీఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్  ద్వారా ఈ సినిమా మంచి మార్కులను కొట్టేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Shane Nigam
Antony Varghese
Neeraj Madhav
Mahima Nambiar
  • Loading...

More Telugu News