IT Employees Car Rally: ఇది పాకిస్థాన్ బోర్డర్ కాదంటూ వీడియోను పోస్టు చేసిన టీడీపీ.. వందలాదిమంది పోలీసులతో పహరా!
- చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ
- అడ్డుకునేందుకు రాత్రి నుంచే గరికపాడు వద్ద భారీ ఎత్తున పోలీసుల మోహరింపు
- పోలీసులను దింపి తాడేపల్లి పిల్లి భయపడుతూ ప్యాలెస్‌లో పడుకుందని టీడీపీ ఎద్దేవా
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు మద్దతుగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి చేపట్టిన ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ ర్యాలీపై ఆంక్షలు విధించిన పోలీసులు ఏపీ సరిహద్దు గరికపాడు వద్ద శనివారం రాత్రి నుంచే పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి వచ్చే ప్రతీ వాహనాన్ని పూర్తిగా తనఖీ చేసిన తర్వాతే విడిచిపెడుతున్నారు.
గరికపాడు వద్ద భారీగా మోహరించిన పోలీసుల వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన తెలుగుదేశం పార్టీ.. ‘ఇది పాకిస్థాన్ బోర్డర్ కాదు.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు’ అని క్యాప్షన్ తగిలించింది. చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్న ఐటీ ఉద్యోగులకు ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదంటూ వందలాదిమంది పోలీసులను సరిహద్దు వద్ద మోహరించి.. తాడేపల్లి పిల్లి మాత్రం ప్యాలెస్‌లో భయపడుతూ పడుకుందని ఎద్దేవా చేసింది.