it refund: ఆదాయపు పన్ను రిఫండ్స్‌పై ఐటీ శాఖ కీలక సూచన
- రిఫండ్స్ క్లియర్ కావాలంటే ఏం చేయాలో చెప్పిన ఆదాయపు పన్ను శాఖ
- పెండింగ్‌లోని ట్యాక్స్ డిమాండ్లకు సంబంధించిన ఇంటిమేషన్‌కు స్పందించాలని సూచన
- ఎక్స్ వేదికగా సూచన చేసిన ఐటీ శాఖ
ఐటీ రిఫండ్స్‌కు సంబంధించి ట్యాక్స్ పేయర్స్‌కు ఆదాయపు పన్ను శాఖ కీలక సూచన చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిఫండ్స్ క్లియర్ కావాలంటే అంతకుముందు సంవత్సరాల్లో పెండింగ్‌లో ఉన్న ట్యాక్స్ డిమాండ్లకు సంబంధించి వచ్చిన ఇంటిమేషన్‌కు స్పందించాలని ఐటీ శాఖ సూచించింది. రిటర్న్స్ ప్రాసెసింగ్, రిఫండ్స్ జారీకీ వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఐటీ శాఖ తనవంతు కృషి చేస్తోందని తెలిపింది.
ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ లో ట్వీట్ చేసింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్-సెటిల్డ్ ట్యాక్స్ డిమాండ్ల గురించి ఐటీ శాఖ నుంచి తమకు సమాచారం అందిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఆదాయపు పన్ను శాఖ స్పందించింది.