Rashmika Mandanna: 'యానిమల్' నుంచి రష్మిక హోమ్లీ లుక్!

Animal movie update

  • రష్మిక - రణబీర్ కాంబోలో రూపొందిన 'యానిమల్'
  • డిసెంబర్ 1వ తేదీన సినిమా విడుదల 
  • హైలైట్ గా నిలవనున్న హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం
  • లైన్లోనే ఉన్న 'పుష్ప 2'  

రష్మిక ఒక వైపున తెలుగులో సినిమాలు చేస్తూనే, మరో వైపున కన్నడ ఇండస్ట్రీలో తన స్థానానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. అలాగే తమిళ .. హిందీ భాషల్లో నిలదొక్కుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. అలా హిందీలో ఆమె చేసిన 'మిషన్ మజ్ను' సినిమా ఆమెకి మంచి మార్కులు తెచ్చిపెట్టింది.

ఆ తరువాత సినిమాగా హిందీలో ఆమె చేసిన 'యానిమల్' డిసెంబర్ 1వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రష్మిక లుక్ ను వదిలారు. రష్మిక చీరకట్టులో హోమ్లీ లుక్ తో ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాకి సందీప్ వంగా దర్శకత్వం వహించాడు. 

హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లో తన జోరు పెరగడం ఖాయమనే నమ్మకంతో రష్మిక ఉంది. ఇక తెలుగు నుంచి 'పుష్ప 2' కూడా రావలసి ఉంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై కూడా రష్మిక మరిన్ని ఆశలు పెట్టుకుంది. ఈ రెండు సినిమాలతో రష్మిక గ్రాఫ్ మరింత పుంజుకుంటుందేమో చూడాలి.

Rashmika Mandanna
Ranbir Kapoor
Animal
  • Loading...

More Telugu News