Navdeep: డ్రగ్స్ కేసు.. ఈరోజు నార్కోటిక్ పోలీసుల ముందుకు రానున్న హీరో నవదీప్

Actor Navdeep to attend before Narcotic wing

  • మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఏ29గా హీరో నవదీప్
  • విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశం
  • నవదీప్ ద్వారా ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్టు భావిస్తున్న పోలీసులు

డ్రగ్స్ వ్యవహారం మరోసారి టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఏ29గా హీరో నవదీప్ ను నార్కోటిక్ పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు గాను నవదీప్ ఇరోజు నార్కోటిక్ పోలీసుల ముందుకు రానున్నాడు. డ్రగ్స్ పెడ్లర్ రామ్ చందర్, నవదీప్ కు మధ్య ఉన్న సంబంధాలపై నార్కోటిక్ పోలీసులు ఆరా తీయనున్నారు. 

మరోవైపు నవదీప్ ద్వారా సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా అయినట్టు పోలీసులు భావిస్తున్నారు. రామ్ చందర్ ను అరెస్ట్ చేసినప్పటి నుంచి నవదీప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు 41 ఏసీఆర్పీసీ కింద విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో విచారణకు నవదీప్ హాజరుకానున్నాడు.

More Telugu News