Varalakshmi Sharath Kumar: హాట్ స్టార్ లో మిస్టరీ థ్రిల్లర్ గా 'మాన్షన్ 24' .. అవికా ఇంట్రెస్టింగ్ పోస్టర్!

Mansion 24 Web Series Update

  • థ్రిల్లర్ జోనర్లో రూపొందిన 'మాన్షన్ 24'
  • ప్రధానమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ 
  • ఉత్కంఠను రేపుతున్న పోస్టర్లు 
  • హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు 

హాట్ స్టార్ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ .. మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అదే ఓటీటీ సెంటర్ నుంచి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడనికి 'మాన్షన్ 24' రెడీ అవుతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధానమైన పాత్రగా ఓ మాన్షన్ చుట్టూ అల్లుకున్న హారర్ స్టొరీ ఇది. హాట్ స్టార్ వారు నిర్మించిన ఈ సిరీస్ కి ఓంకార్ దర్శకత్వం వహించాడు. 

త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ రానుంది. ఈ నేపథ్యంలో ప్రధానమైన పాత్రలకి సంబంధించిన ఒక్కో పోస్టర్ ను వదులుతూ వస్తున్నారు. అలా తాజాగా అవికా గోర్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రక్తంతో తడిసిన ఒక వెపన్ ను పట్టుకుని కసితో కూడిన చూపులతో ఆమె ఈ పోస్టర్లో కనిపిస్తోంది. మరింతగా ఈ సిరీస్ పై ఆసక్తిని పెంచుతోంది.

భారీ తారాగణంతో ఈ సిరీస్ నిర్మితం కావడం విశేషం. ఆ జాబితాలో అవికా గోర్ .. బిందుమాధవి .. విద్యుల్లేఖ రామన్ .. మీనా కుమారి .. అభినయ .. తులసి .. సత్యరాజ్ .. రావు రమేశ్ .. అవినాశ్ కురువిల్లా .. రాజీవ్ కనకాల కనిపిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సిరీస్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Varalakshmi Sharath Kumar
Avika Gor
Bindumadhavi
Sathya Raj
Rao Ramesh
  • Loading...

More Telugu News