Chandrababu: సీఐడీ కస్టడీలో చంద్రబాబు.. విచారణ ప్రారంభం.. ప్రతి గంటకూ 5 నిమిషాల బ్రేక్!

CID took Chandrababu into custody

  • రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు విచారణ ప్రారంభం
  • మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్
  • జైలు పరిసరాల్లో రెండంచెల భద్రత ఏర్పాటు

రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయమే చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం మెడికల్ టెస్టులు చేసింది. అల్పాహారాన్ని తీసుకున్న చంద్రబాబు మెడిసిన్స్ వేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు సరిగ్గా ఉదయం 9.30 గంటలకు ఆయనను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని, విచారణను ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఇస్తారు. 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. ప్రతి గంటకూ చంద్రబాబుకు 5 నిమిషాల పాటు బ్రేక్ ఇస్తారు. సీఐడీ విచారణ నేపథ్యంలో జైలు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. జైలు పరిసరాల్లో రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీఐడీ డీఎస్పీ ఎం.ధనుంజయుడు నేతృత్వంలో 12 మంది సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News