Sai Pallavi: ఓ దర్శకుడ్ని సీక్రెట్ గా పెళ్లాడినట్టు జరుగుతున్న ప్రచారంపై సాయిపల్లవి వివరణ

Sai Pallavi sharply reacts on rumors

  • ఇటీవల సాయిపల్లవి కొత్త చిత్రం ప్రారంభం
  • ముహూర్తం షాట్ కు దర్శకుడు పెరియసామి, సాయిపల్లవి హాజరు
  • మెడలో పూలదండలతో సాయిపల్లవి, పెరియసామి ఫొటో వైరల్
  • పెళ్లంటూ ప్రచారం చేసిన వ్యక్తులు

ప్రముఖ నటి సాయిపల్లవి తమిళ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామిని రహస్యంగా పెళ్లాడిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. సాయిపల్లవి, పెరియసామి మెడలో దండలతో ఉన్న ఫొటో కావడంతో ఆ వార్త వెంటనే పాకిపోయింది. దాంతో, సాయిపల్లవి వెంటనే స్పందించింది. పుకార్లను ఖండించింది. ఆ ఫొటో తన కొత్త చిత్రం (ఎస్కే 21) ముహూర్త కార్యక్రమం సందర్భంగా తీసినదని వెల్లడించింది. 

"నిజాయతీగా చెప్పాలంటే నేను వదంతుల గురించి పట్టించుకోను. కానీ నా స్నేహితులను, కుటుంబాన్ని కూడా ఇలాంటి విషయాల్లోకి లాగితే మాత్రం తప్పకుండా మాట్లాడతాను. వాస్తవానికి అది నా కొత్త సినిమా ప్రారంభోత్సవంలోనిది. డబ్బుకు అమ్ముడుపోయి, ఆ ఫొటోను కత్తిరించి తప్పుడు ఉద్దేశాలతో ప్రచారం చేస్తున్నారు. నా కెరీర్ గురించి పంచుకోవడానికి ఎన్నో ఆహ్లాదకరమైన సంగతులు ఉన్నప్పుడు, ఇలాంటి ఆకతాయి చేష్టల గురించి స్పందించాల్సి రావడం బాధ కలిగిస్తోంది. ఈ విధంగా తప్పుడు ఫొటోలతో ఒకరిని ఇబ్బంది పెట్టాలనుకోవడం నీచమైన పని" అని సాయిపల్లవి ఘాటుగా స్పందించారు. 

నటి సాయిపల్లవి కొత్త సినిమా ఎస్కే 21 వర్కింగ్ టైటిల్ తో చెన్నైలో మే నెలలో ప్రారంభమైంది. పూజా కార్యక్రమం సందర్భంగా మెడలో పూలమాలలతో ఉన్న సాయిపల్లవి, దర్శకుడు పెరియసామిలను కెమెరాలు క్లిక్ మనిపించాయి. 

ఆ సమయంలో దర్శకుడు పెరియసామి చేతిలో ముహూర్తం షాట్ కు సంబంధించిన క్లాప్ బోర్డు కూడా ఉంది. అయితే, కొందరు ఆ క్లాప్ బోర్డు కనిపించకుండా ఫొటోను ఎడిట్ చేసి, మెడలో దండలతో ఉన్న సాయిపల్లవి, పెరియసామి ఫొటోలను వైరల్ చేశారు.

వైరల్ అవుతున్న ఫొటో ఇదే...


కొత్త సినిమా ఓపెనింగ్ నాటి ఒరిజినల్ ఫొటో...

Sai Pallavi
Rumors
Rajkumar Periasami
Marriage
SK21
Opening Ceremony
  • Loading...

More Telugu News