Kumaraswamy: ఎన్డీయేలో చేరిన కుమారస్వామి.. కూటమిలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామన్న నడ్డా

Kumaraswamy party JDS joins NDA

  • అమిత్ షా, నడ్డాలతో కుమారస్వామి భేటీ
  • ఎన్డీయేలో చేరినట్టు ప్రకటన
  • పార్లమెంటు ఎన్నికలకు ముందు కర్ణాటకలో కీలక పరిణామం

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీయే కూటమిలో జేడీఎస్ పార్టీ చేరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఈరోజు ఢిల్లీలో జేడీఎస్ అగ్రనేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భేటీ అయ్యారు. వీరి సమావేశం ముగియగానే ఎన్డీయేలో చేరినట్టు కుమారస్వామి ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఎన్డీయేలో జేడీఎస్ చేరడంతో కర్ణాటక రాజకీయాలు ఏ విధంగా మారబోతాయో అనే ఆసక్తి నెలకొంది. అయితే సీట్ల షేరింగ్ కు సంబంధించి మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. 

ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా జేపీ నడ్డా స్పందిస్తూ... ఎన్డీయేలో భాగస్వామి కావాలని జేడీఎస్ నిర్ణయించుకోవడం సంతోషకరమని చెప్పారు. వారిని ఎన్డీయే కూటమిలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. న్యూ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా అనే ప్రధాని మోదీ విజన్ ను ఈ చేరిక మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.

Kumaraswamy
JDS
NDA
JP Nadda
Amit Shah
BJP
  • Loading...

More Telugu News