Ram Charan: వాట్సాప్ చానల్స్ లో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్

Ram Charan enters into Whatsapp Channels

  • ఇటీవల చానల్స్ ఫీచర్ తీసుకువచ్చిన వాట్సాప్
  • యూజర్లకు దగ్గరయ్యేందుకు చానల్స్ ఫీచర్ ఉపకరిస్తుందన్న వాట్సాప్
  • టాలీవుడ్ లో ఇప్పటికే చానల్స్ క్రియేట్ చేసుకున్న రాజమౌళి, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ

అత్యధిక సంఖ్యలో యూజర్లకు చేరువయ్యేందుకు ప్రముఖ సోషల్ మెసేజింగ్ వేదిక వాట్సాప్ చానల్స్ పేరిట వన్ వే బ్రాడ్ కాస్ట్ టూల్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ వాట్సాప్ చానల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 

తాజాగా, టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా వాట్సాప్ చానల్ ను ప్రారంభించారు. ఈ మేరకు ఆయన తన చానల్ ను చూడాలని ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ లింకును పంచుకున్నారు. వాట్సాప్ ఇటీవలే ఈ చానల్స్ ఫీచర్ తీసుకువచ్చింది. వాట్సాప్ ఉన్న ఎవరైనా సరే చానల్ ప్రారంభించవచ్చు. తమ అప్ డేట్లను యూజర్లతో పంచుకోవచ్చు. టాలీవుడ్ లో ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖులు వాట్సాప్ చానల్స్ లోకి కాలుమోపారు. 

రామ్ చరణ్ వాట్సాప్ చానల్ లింకు: https://www.whatsapp.com/channel/0029Va9XxtILdQeZP2PQv30h

More Telugu News