Navdeep: మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు నోటీసులు

Police send notice to hero Navdeep in Madhapur drugs case

  • మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ పై ఆరోపణలు
  • 41ఏ కింద నవదీప్ కు యాంటీ నార్కోటిక్ బ్యూరో నోటీసులు
  • ఈ నెల 23న విచారణకు రావాలని స్పష్టీకరణ

మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ పై ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, పోలీసులు నవదీప్ కు నోటీసులు పంపించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో 41ఏ కింద విచారణకు రావాలంటూ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ నెల 23న హెచ్ న్యూ ఆఫీస్ లో విచారణకు హాజరు కావాలని తెలిపారు. 

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ఏ-37గా ఉన్నాడు. తన ఫ్రెండ్ రామ్ చంద్ తో కలిసి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, డ్రగ్స్ కేసులో తన పేరు వినపడగానే నవదీప్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, విచారణకు సహకరించాలంటూ హైకోర్టు నవదీప్ కు హితవు పలికింది.

More Telugu News