nandamuri ramakrishna: రాజమండ్రి జైల్లో సత్యనారాయణ మృతి పట్ల సంతాపం తెలిపిన నందమూరి రామకృష్ణ

Nandamuri Ramakrishna on Rajahmundry jail khaidi death

  • 19 ఏళ్ల కుర్రాడు చనిపోవడంపై అధికారులు మూడు రకాల వాదనలు వినిపించారన్న రామకృష్ణ
  • సత్యనారాయణ కుటుంబసభ్యులకు అండగా ఉంటామని వెల్లడి
  • చంద్రబాబు ఇదే జైల్లో ఉండటం తమకు ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్య

రాజమండ్రి కేంద్రకారాగారంలో ఖైదీ గంజేటి వీరవెంకట సత్యనారాయణ మృతిపట్ల నందమూరి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ధవళేశ్వరానికి చెందిన వీరవెంకట సత్యనారాయణ ఈ జైల్లో డెంగ్యూతో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయం తెలిసిన రామకృష్ణ... మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రబాబు ఇదే జైల్లో ఉండటం తమకు ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆయనకు జైల్లో సరైన సౌకర్యాలు కల్పించాలన్నారు. 

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ...19 ఏళ్ల కుర్రాడు సత్యనారాయణ చనిపోవడంపై అధికారులు మూడు రకాల వాదనలు వినిపిస్తున్నారన్నారు. తొలుత టైఫాయిడ్ అన్నారని, ఇప్పుడు డెంగ్యూ అంటున్నారన్నారు. అతని కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామన్నారు. చంద్రబాబు జైల్లో ఇబ్బందికరంగా ఉన్నారని తన సోదరి భువనేశ్వరి చెప్పారన్నారు.

nandamuri ramakrishna
Chandrababu
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News