Nitin Gadkari: చంద్రబాబు గురించి కేశినేని నాని నుంచి ఆరా తీసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

Nitin Gadkari asks about Chandrababu

  • పార్లమెంట్ ఆవరణలో గడ్కరీకి ఎదురుపడిన కేశినేని నాని
  • చంద్రబాబు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపిన టీడీపీ ఎంపీ
  • చంద్రబాబు ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదని, మచ్చలేని నాయకుడని తనతో అన్నారని వెల్లడి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గురించి కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ ఆరా తీశారట. పార్లమెంట్ ఆవరణలో ఎదురుపడిన టీడీపీ ఎంపీ కేశినేని నానిని టీడీపీ అధినేత గురించి కేంద్రమంత్రి అడిగారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తనతో గడ్కరీ మాట్లాడినట్లుగా చెబుతూ టీడీపీ ఎంపీ తన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఈ రోజు పార్లమెంటు ఆవరణలో ఎదురుపడి చంద్రబాబు యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఆయన ఒక్క గొప్ప నాయకుడని, ఎటువంటి తప్పు చేసే వ్యక్తి కాదని మచ్చలేని ప్రజా సేవకుడని, భగవంతుని ఆశీస్సులతో అన్ని విఘ్నాలు తొలగించుకొని కడిగిన ముత్యంలాగ బయటపడతారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Nitin Gadkari
Kesineni Nani
Chandrababu
Parliament

More Telugu News