Balakrishna: మందబలంతో విర్రవీగుతున్నారు.. ప్రజలే బుద్ధి చెపుతారు: బాలకృష్ణ

People will teach them a lesson says Balakrishna
  • రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే చంద్రబాబుపై కేసు పెట్టారన్న బాలకృష్ణ
  • స్కిల్ డెవలప్ మెంట్ లో విద్యార్థులకు ఎంతో మేలు జరిగిందని వ్యాఖ్య
  • జగన్ నియంత మాదిరి పాలిస్తున్నారని మండిపాటు

టీడీపీ అధినేత చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు పెట్టారని ఆ పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబుపై పెట్టిన కేసులపై పోరాటాన్ని ఆపేది లేదని చెప్పారు. ఇలాంటి కేసులను గతంలో ఎన్నో చూశామని అన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని, ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది యువత శిక్షణ పొందారని, ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. మందబలంతో విర్రవీగుతున్నవారికి ప్రజలే బుద్ధి చెపుతారని అన్నారు. 

స్కిల్ డెవలప్ మెంట్ పథకం ద్వారా విద్యార్థులకు మేలు జరిగితే... అవినీతి జరిగిందని ఎలా చెపుతారని బాలయ్య ప్రశ్నించారు. నియంత మాదిరి జగన్ పాలిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ సభ్యులందరినీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాలయ్య పైవ్యాఖ్యలు చేశారు.
Balakrishna
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News