Aishwarya Rai: మెగాస్టార్ జోడీగా మెరవనున్న ఐశ్వర్య రాయ్!

Aishwarya Rai in Chiranjeevi Movie

  • చిరూ 156వ సినిమా కల్యాణ్ కృష్ణతో
  • 157వ సినిమాకి దర్శకుడు వశిష్ఠ
  • కథానాయికలుగా అనుష్క .. ఐశ్వర్య రాయ్ .. మృణాళ్ 
  • 158వ సినిమాకి దర్శకుడు అనిల్ రావిపూడి


చిరంజీవి 156వ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి, సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక 157వ సినిమాను వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, షూటింగు దిశగా అడుగులు వేస్తోంది. 

ఇది సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ. ముగ్గురు కథానాయికలకు ఛాన్స్ ఉంటుందని ముందుగానే చెప్పారు. ఒక కథానాయికగా అనుష్క పేరు .. మరో కథానాయికగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపించింది. తాజాగా ఐశ్వర్య రాయ్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెను సంప్రదించడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. 

ఐశ్వర్య రాయ్ తన కెరియర్ తొలినాళ్లలో 'రావోయి చందమామ' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తరువాత ఆమె నేరుగా తెలుగు సినిమా చేసింది లేదు. అలాంటి ఆమె ఈ సినిమా ఒప్పుకుందనే విషయం కచ్చితంగా ఆసక్తిని రేకెత్తించేదే. ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ ప్రాజెక్టు అనిల్ రావిపూడితో ఉంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

Aishwarya Rai
Chiranjeevi
Anushka Shetty
Mrunhjal Thakur
  • Loading...

More Telugu News