Varalakshami Sharath Kumar: 'మ్యాన్షన్ 24'తో భయపెట్టనున్న వరలక్ష్మి శరత్ కుమార్!

Mansion 24 Web Series Update

  • హాట్ స్టార్ వేదికపై 'మ్యాన్షన్ 24'
  • హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • దర్శకత్వం వహించిన ఓంకార్ 
  • కీలక పాత్రల్లో సత్య రాజ్ - రావు రమేశ్

తమిళ .. తెలుగు భాషల్లో నటిగా వరలక్ష్మి శరత్ కుమార్ కి మంచి క్రేజ్ ఉంది. ఓ వైపున తనకి నచ్చిన నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను చేస్తూనే, మరో వైపున నాయిక ప్రధానమైన కథలను కూడా తన భుజాన వేసుకుని వెళుతోంది. ఇక తను ప్రధానమైన పాత్రగా చేయవలసి వస్తే, వెబ్ సిరీస్ లు చేయడానికి కూడా ఆమె ఎంతమాత్రం వెనకాడటం లేదు. 

అలా ఆమె చేసిన వెబ్ సిరీస్ పేరు 'మ్యాన్షన్ 24'. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి ఓంకార్ దర్శకత్వం వహించాడు. హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ వెబ్ సిరీస్ కొనసాగుతుంది. గతంలో 'రాజుగారి గది' వంటి హారర్ థ్రిల్లర్ సినిమాలను రూపొందించిన అనుభవం ఓంకార్ కి ఉంది.  అందువలన సహజంగానే ఈ సిరీస్ పట్ల అందరిలో ఆసక్తి ఉంది.

ఒక మ్యాన్షన్ కి వెళ్లిన కొంతమంది యువతులు .. యువకులు అందులో చిక్కుబడిపోతారు. అందుకు కారణం ఏమిటి? అక్కడి నుంచి వాళ్లు బయటపడ్డారా లేదా? అనేది కథ. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ లో, బిందుమాధవి .. అవికా గోర్ .. అభినయ .. సత్యరాజ్ .. రావు రమేశ్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

More Telugu News