Vishwak Sen: 7 మిలియన్ ప్లస్ వ్యూస్ ను కొల్లగొట్టిన గోదారి పాట!

Gangs Of Godavari movie update

  • విష్వక్సేన్ హీరోగా రూపొందిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'
  • ఆయన సరసన సందడి చేయనున్న నేహా శెట్టి 
  • దూసుకుపోతున్న 'సుట్టంలా సూసి' పాట 
  • డిసెంబర్ 8వ తేదీన సినిమా విడుదల  

విష్వక్సేన్ హీరోగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా రూపొందింది. సితార నాగవంశీ - సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి, కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. గోదావరి జిల్లాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. కథానాయికగా నేహా శెట్టి అందాల సందడి చేయనున్న ఈ సినిమాలో, మాస్ లుక్ తో విష్వక్సేన్ కనిపించనున్నాడు.

రీసెంటుగా ఈ సినిమా నుంచి గోదావరి నేపథ్యంలో ఒక పాటను వదిలారు. 'సుట్టంలా సూసి' అంటూ ఈ పాట నడుస్తుంది. హీరో .. హీరోయిన్ పై ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట 7 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.

యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చగా, శ్రీహర్ష ఈమని సాహిత్యాన్ని అందించగా .. అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. యువన్ శంకర్ రాజా బీట్ .. కథ నేపథ్యానికి తగిన సాహిత్యం .. పాటను చిత్రీకరించిన తీరు కనెక్ట్ అయింది. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Vishwak Sen
Neha Shetty
Yuvan Shankar Raja
Gangs of Godavari

More Telugu News