Rahul Gandhi: కూలీ అవతారంలో రాహుల్‌గాంధీ.. రైల్వే స్టేషన్‌లో సూట్‌కేసు మోసిన కాంగ్రెస్ అగ్రనేత.. వీడియో ఇదిగో!

- ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌ను సందర్శించిన రాహుల్‌గాంధీ
- ఎరుపు రంగు కూలీ షర్ట్, చేతికి బ్యాడ్జ్ ధరించిన కాంగ్రెస్ నేత
- పోర్టర్ల సమస్యలను శ్రద్ధగా విన్న వయనాడ్ ఎంపీ
- వారి గదికి వెళ్లి పరిశీలన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రైల్వే స్టేషన్‌లో కూలీ అవతారం ఎత్తి సూట్‌కేసు మోశారు. ఈ రోజు ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌ను సందర్శించిన రాహుల్ అక్కడి పోర్టర్లను కలిశారు. ఎరుపు రంగు కూలీ షర్ట్, చేతికి బ్యాడ్జ్ ధరించి తలపై లగేజీ పెట్టుకుని మోశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోర్టర్లతో మాట్లాడిన రాహుల్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారుండే గదికి వెళ్లి పరిశీలించారు.


