salaar: ఉత్తర అమెరికాలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ‘సలార్’ అదిరిపోయే రికార్డు
- రూ. 36 కోట్లకు సలార్ హక్కులు
- 40 కోట్లతో అగ్రస్థానంలో ఆర్ఆర్ఆర్
- మొత్తం 350 కోట్ల ప్రీ బిజినెస్ చేసిన సలార్
ప్రభాస్ పాన్ ఇండియా సినిమా సలార్‌పై భారీ అంచనాలున్నాయి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 28నే విడుదల కావాల్సింది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాకపోవడంతో వాయిదా పడింది. ఇక ఈ చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తోంది. ఉత్తర అమెరికాలో ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత సలార్ అత్యధిక బిజినెస్ చేసిన తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఉత్తర అమెరికాలో ఆర్ఆర్ఆర్ సినిమా హక్కులు 40 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు సలార్ సినిమా హక్కులు 36 కోట్లకి అమ్ముడుపోయాయి.
కాగా, సలార్ శాటిలైట్ (స్టార్ టీవీ), డిజిటల్ (నెట్‌ఫ్లిక్స్ - తెలుగు, తమిళ్, కన్నడ భాషలు), ఆడియో రైట్స్ కలిపి ఇప్పటికే రికార్డు స్థాయిలో 350 కోట్లకు అమ్ముడయ్యాయి. సినిమా వాయిదా పడడంతో నిరుత్సాహంలో ఉన్న అభిమానుల్లో ఈ రికార్డులు కచ్చితంగా సంతోషం తెప్పిస్తున్నాయి. కాగా, సలార్ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించాడు.