Lok Sabha: అసదుద్దీన్ సహా... మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన మరో ఎంపీ !
- ఓటింగ్ సమయంలో లోక్ సభలో 456 మంది ఎంపీలు
- బిల్లును వ్యతిరేకించిన మజ్లిస్ పార్టీ ఎంపీలు
- వ్యతిరేకంగా ఓటేసిన వారిలో ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ కూడా
దశాబ్దాలుగా వేచి చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు బుధవారం సాయంత్రం లోక్ సభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ సమయంలో 456 మంది ఎంపీలు ఉండగా, 454 మంది బిల్లుకు అనుకూలంగా, ఇద్దరు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినవారిలో మజ్లిస్ పార్టీ ఎంపీలు ఉన్నారు.
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఇదే పార్టీకి చెందిన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ వ్యతిరేకంగా ఓటు వేశారు. 2019లో మజ్లిస్ పార్టీ మహారాష్ట్రలో ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.